వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. తాజాగా వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది.
హైదరాబాద్(Hyderabad)లో వీధి కుక్కల దాడి(Dogs Attack) ఘటనలు ఆగడం లేదు. మనుషులు కనిపించగానే కొన్ని కుక్కలు వెంటాడుతున్నాయి. మరికొన్ని కండలు పీకే వరకూ వదలడం లేదు. ముఖ్యంగా చిన్నారుల(Childrens)పై కుక్కల దాడులు ఎక్కడోకచోట జరుగుతూనే ఉన్నాయి. కుక్కల భయంతో కొంత మంది ఇంటి నుంచి అడుగు బయటపెట్టడం లేదు. వీధి కుక్కల దాడుల్లో గతంలో హైదరాబాద్‌తో పాటుగా ఇంకొన్ని ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో చిన్నారులు ప్రాణాలను కోల్పోయిన సంగతి తెలిసిందే.
బాలుడిపై వీధి కుక్క దాడి చేసిన ఘటనకు సంబంధించి సీసీ కెమెరా వీడియో:
తాజాగా మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ సూరారం డివిజన్ అయిన శ్రీరామ్ నగర్ కాలనీలో ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. వీధి కుక్క ఓ బాలుడిపై దాడి(Dog Attack) చేసింది. బాలుడ్ని తీవ్రంగా గాయపర్చింది. బాలుడ్ని తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రస్తుతం ఆ బాలుడికి చికిత్స జరుగుతోంది. ఈ ఘటనకు సంబంధించిన సీసీ కెమెరా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్(Video Viral) అవుతోంది.
వేసవిలో చిన్నపిల్లలే టార్గెట్‌గా కుక్కల దాడులు జరుగుతున్నాయి. ఎండల తీవ్రత కారణంగా వీధి కుక్కలు ఇలా ప్రవర్తిస్తున్నాయని కొందరు అంటున్నారు. కల్తీ ఆహారపదార్థాలు, రోడ్ల వద్ద పాడైపోయిన పదార్థాలు తినడం వల్ల కుక్కలు అలా ప్రవర్తిస్తున్నట్లు మరికొందరు చెబుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కుక్కలు దాడులు జరుగుతున్నా ప్రభుత్వ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.