»An Online Game Where A Mother And Two Children Suicide At Choutuppal
Suicide: తల్లి, ఇద్దరు బిడ్డల ప్రాణాలు తీసిన ఆన్ లైన్ గేమ్
ఆన్ లైన్ గేమ్(online game) వ్యసనం కారణంగా ఓ 28 ఏళ్ల మహిళతోపాటు తన ఇద్దరు పిల్లలు కూడా మృత్యువాత చెందారు. ఈ విషాద ఘటన తెలంగాణలోని చౌటుప్పల్(choutuppal) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
కొందరు వ్యక్తులు ఓ మహిళకు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి చెల్లించాలని కోరడంతో మనస్తాపానికి గురైన 28 ఏళ్ల మహిళ మంగళవారం తన ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఈ దారుణ ఘటన చౌటుప్పల్(choutuppal) పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇక వివరాల్లోకి వెళితే గొల్నేపల్లికి చెందిన అవిశెట్టి మల్లేష్(లారీ డ్రైవర్), అతని భార్య రాజేశ్వరి(28) కొంతకాలంగా ఆన్ లైన్ గేమింగ్(online game)కు అలవాటు పడింది. ఆ క్రమంలో ఆమె 8 లక్షల రూపాయలకు పైగా పొగుట్టుకుంది. వీరికి అనిరుధ్(5), హర్షవర్ధన్(3)అనే ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే రాజేశ్వరి పలువురి నుంచి డబ్బులు తీసుకుని ఆన్ లైన్ గేమ్ ఆడుతూ ఉండేది. ఆ క్రమంలో ఆమె సుమారు రూ.4 లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలిసింది.
మంగళవారం మహిళకు డబ్బులు ఇచ్చిన ఓ బంధువు వచ్చి అప్పుగా తీసుకున్న నగదు(cash) ఇవ్వాలని నిలదీశారు. ఆమె భూమి అమ్మి ఇస్తానని చెప్పినా కూడా అతను వినలేదు. ఆ క్రమంలో ఆమె భర్త ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. అదే క్రమంలో అప్పుగా ఇచ్చిన బంధువు కూడా రుణం గురించి అడిగి తిరిగివెళ్లాడు. కానీ ఆ క్రమంలో మనస్థాపానికి గురైన మహిళ ఇద్దరు కుమారులతో కలిసి నీటి సంపులోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇక రాత్రి ఇంటికి వచ్చి చూసిన భర్త షాక్ అయ్యాడు. ఆ క్రమంలో వారిని బయటకు తీసి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. కానీ అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.