ATP: గుత్తి రైల్వే జంక్షన్ మీదుగా ప్రయాణించే నాగర్సోయిల్-చెన్నై వీక్లీ ఎక్స్ ప్రెస్ ఏసీ కోచ్‌లో ప్రయాణిస్తున్న విజయ రమణి అనే మహిళ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందినట్లు జీఆర్పీ పోలీసులు తెలిపారు. మధురైకి చెందిన ఆమె.. కుటుంబ సభ్యులతో కలిసి నాగర్సోయిల్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అధిక షుగర్ కారణంగా ఆమె మరణించినట్లు ప్రాథమికంగా గుర్తించారు.