వరంగల్ జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆగిన డీసీఎంను వేగంగా వచ్చిన కారు ఢీకొనడంతో ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. డీసీఎం డ్రైవర్, క్లీనర్ తోపాటు కారులో ఉన్న ఆరేళ్ల చిన్నారి కూడా మృత్యువాత చెందింది. దీంతోపాటు కారులోని మరో ఇద్దరికి తీవ్రంగా గాయాలయ్యాయి. డీసీఎంకు పంక్చర్ అయిన క్రమంలో రోడ్డు పక్కన ఆపి వారు రిపేర్ చేసుకుంటున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన జనగామ జిల్లా పెంబర్తి పరిధిలో చోటుచేసుకుంది.
గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం తెలుపగా…పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు నడుపుతున్న వ్యక్తి నిద్రమత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.