»A 4 Year Old Boy Holds The Guinness World Record For Being The Worlds Youngest Author
Worlds Youngest Author: 4 ఏళ్ల బాలుడు ప్రపంచంలో పిన్న వయస్కుడైన రచయితగా రికార్డు
యూఏఈకి చెందిన ఓ నాలుగేళ్ల బుడ్డోడు ప్రపంచ రికార్డు సృష్టించాడు. అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri) 4 సంవత్సరాల 218 రోజుల్లో ఓ పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ ప్రపంచ రికార్డు(Worlds Youngest Author) సృష్టించాడు. ఆ క్రమంలో ఆ పిల్లాడు రచించిన ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్ బుక్ వెయ్యికిపైగా కాపీలు అమ్మడు కావడం విశేషం.
ఓ నాలుగేళ్ల పిల్లాడు(4 years child) వయస్సు అనేది ఓ అంకె మాత్రమేనని… సాధన చేస్తే ఏదైనా చేయవచ్చని నిరూపించాడు. ఏకంగా ఓ పుస్తకం రచించి గిన్నిస్ వరల్డ్ రికార్డు(Guinness World Record) సృష్టించాడు. ఇక వివరాల్లోకి వెళితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన నాలుగేళ్ల బాలుడు పిల్లల పుస్తకం ‘ది ఎలిఫెంట్ సయీద్ అండ్ ది బేర్’ అనే పుస్తకాన్ని రచించి ప్రచురణ కూడా చేయించాడు. ఆ తర్వాత ఈ బుక్ 1,000 కంటే ఎక్కువ కాపీలు అమ్ముడయ్యింది. ఈ నేపథ్యంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధులు అతని ప్రతిభను గుర్తించి అతి పిన్న వయస్కుడైన రచయితగా మార్చి 9, 2023న నిర్ధారించారు.
అబుదాబికి చెందిన లిటిల్ సయీద్ రషెద్ అల్ మహీరి(Little Saeed Rashed AlMheiri)నాలుగు సంవత్సరాల 218 రోజుల వయస్సులో ఈ పుస్తకాన్ని రచించి, ప్రచురించారు. ఇది రెండు జంతువులైన ఏనుగు, ధృవపు ఏలుగు బంటి మధ్య అనుకోకుండా ఏర్పడిన స్నేహం, దయ గురించి కథగా ఈ పిల్లాడు రచించాడు. అయితే ఆ పిల్లాడు తన అక్క అల్దాబీ నుంచి ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది.
అతని సోదరి(sister) ద్విభాషా పుస్తకాన్ని ప్రచురించింది. ఆ క్రమంలో ప్రపంచంలోని అతి పిన్న వయస్కురాలిగా ఆమె రికార్డును ఇప్పటికే కలిగి ఉంది. అయితే అల్దాబి ఎనిమిదేళ్ల 239 రోజుల వయస్సులో ద్విభాషా పుస్తకాన్ని ప్రచురించిన అతి పిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. అయితే తన అక్క రికార్డును ప్రస్తుతం తమ్ముడే బ్రేక్ చేయడం విశేషం.
ఈ సందర్భంగా తన సోదరిని చాలా ఇష్టపడతానని ఆ పిల్లాడు చెప్పుకొచ్చాడు. ఆమెతో ఆడుకోవడం ఎల్లప్పుడూ ఆనందిస్తానని తెలిపాడు. తాము కలిసి చదవడం, వ్రాయడం, గీయడం, చాలా కార్యకలాపాలు చేస్తామని వెల్లడించారు. ఈ క్రమంలో తన సొంత పుస్తకం రచన కోసం ఆమెను స్పూర్తిగా తీసుకున్నట్లు అల్ మహీరి వెల్లడించాడు.