వాల్నట్(walnuts) కాయ తెలుసు కదా మీకు. చాలా గట్టిగా ఉంటుంది. దానిని పగులగొట్టడం కొంచెం కష్టమనే చెప్పవచ్చు. అయితే ఇండియాకు చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ ఇప్పుడు తన నుదిటి తలతో అందరికంటే ఎక్కువగా వాటిని పగులగొట్టి ఏకంగా గిన్నిస్ రికార్డు(guinness world record) సృష్టించాడు. ఆ విశేషాలెంటో ఇప్పుడు చుద్దాం.
భారతదేశానికి చెందిన ఒక మార్షల్ ఆర్టిస్ట్ నవీన్ కుమార్ (naveen kumar) అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఒక నిమిషంలో పెద్ద సంఖ్యలో వాల్నట్ల(walnuts)ను పగులగొట్టి ప్రపంచ రికార్డు సృష్టించి గిన్నిస్ రికార్డుకెక్కాడు. అయితే ఇతను 1 నిమిషంలో 273 వాల్నట్లను తన నుదిటితో పగలగొట్టాడు. అంటే సెకనుకు 4.5 కంటే ఎక్కువ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వెబ్సైట్ పోస్ట్ చేసింది. 27 ఏళ్ల నవీన్ కుమార్, 2017లో సీరియల్ రికార్డ్ బ్రేకర్ ముహమ్మద్ రషీద్ నెలకొల్పిన 254 రికార్డును బద్దలు కొట్టి ఈ ఘనతను సాధించాడు. అయితే రషీద్ తొలిసారిగా 2014లో మొత్తం 150 వాల్నట్లను పగులగొట్టి రికార్డు సాధించాడు. అతను 2016లో మొత్తం 181తో మళ్లీ ప్రయత్నించాడు..
అనేక మార్షల్ ఆర్ట్స్ రికార్డులను కలిగి ఉన్న తన తోటి దేశస్థుడు ప్రభాకర్ రెడ్డి వద్ద శిక్షణ పొందిన కుమార్ 2017లో దీనిపై సాధన చేస్తున్నట్లు తెలుస్తోంది. కుమార్ 217 వాల్నట్లను పగులగొట్టడం ద్వారా రషీద్ రికార్డును బద్దలు కొట్టాడు. ఒక సంవత్సరం తర్వాత ఇటలీలోని లా నోట్ డీ రికార్డ్ సెట్ పోటీలోకి ఓ జంట తలదూర్చారు. వారిద్దరూ స్టాండింగ్ రికార్డును అధిగమించారు. ఇప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత కుమార్ మళ్లీ ప్రపంచంలోనే అగ్రగామి వాల్నట్ క్రాకర్గా టైటిల్ను తిరిగి పొందాడు. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ రికార్డు(guinness world record) బద్దలు కొట్టే ప్రయత్నాన్ని చూపిస్తూ శుక్రవారం ట్విట్టర్లో ఈ మేరకు ఓ వీడియోను పోస్ట్ చేసింది.
New record: The most walnuts cracked with the head in one minute – 273 achieved by Naveen Kumar S 🇮🇳 pic.twitter.com/dUHBuM0jQj
అయితే ఇవి సాధారణ వ్యక్తులు చేయోద్దని నిపుణలు చెబుతున్నారు. దీనికోసం శిక్షణ తీసుకోవాలని, ఎవరు పడితే వారు ఇలాంటివి సాధన చేస్తే మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంటుందని ప్రజలకు సూచించారు. రికార్డుల కోసం లేదా ఏదైనా ఫుడ్ లేదా పలు రకాల ఛాలెంజుల విషయంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు కోరుతున్నారు.