»Sherlyn Chopra Said I Will Marry Congress Leader Rahul Gandhi But
Sherlyn chopra: నేను రాహుల్ గాంధీని పెళ్లి చేసుకుంటా
మోడల్, బాలీవుడ్ హాట్ బ్యూటీ, నటి షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన హాట్ కామెంట్లతో మరోసారి వార్తల్లో నిలిచారు. షెర్లిన్ చోప్రా ఓ మీడియా సంభాషణలో భాగంగా కీలక వ్యాఖ్యలు చేశారు. ఏకంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(rahul gandhi)ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు.
బాలీవుడ్ నటి, మోడల్ షెర్లిన్ చోప్రా(sherlyn chopra) తన పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే షెర్లిన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందో తెలుసా? ఇప్పుడు చుద్దాం. షెర్లిన్ రాహుల్ గాంధీని వివాహం చేసుకోవాలనుకుంటున్నట్లు వెల్లడించింది. అయితే అందుకు షెర్లిన్ ఒక షరతు కూడా పెట్టింది. పెళ్లి తర్వాత తన సర్ నేమ్ చోప్రాగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపింది. అంతేకాదు రాహుల్ గాంధీ ఒక లీడర్ అని, మంచి ఫిట్ నెస్ ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేసింది.
అయితే ఈ అందమైన బాలీవుడ్ నటి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలని తన కోరికను వ్యక్తం చేసిన వీడియో సోషల్ మీడియా(social media)లో వైరల్ అవుతోంది. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. రాహుల్ గాంధీ మిమ్మల్ని ఎప్పటికీ వివాహం చేసుకోకూడదని ఒక వినియోగదారు రాశారు. రాహుల్ గాంధీ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ద్వారా తన జీవితాన్ని వృథా చేసుకోవాలని కోరుకోవడం లేదని మరో యూజర్ రాశారు. షెర్లిన్ నువ్వే చేస్తావ్ కానీ రాహుల్ గాంధీ అస్సలు చేయడు అని ఓ యూజర్ కామెంట్ చేశారు.
జూన్‌లో విపక్ష కూటమి భారత్ ఏర్పాటుపై పాట్నాలో సమావేశం జరిగినప్పుడు బీహార్ మాజీ సీఎం లాలూయాదవ్ నేతలందరి సమక్షంలో రాహుల్‌గాంధీ(rahul gandhi)తో మాట్లాడుతూ..పెళ్లి చేసుకో..వయస్సు వచ్చిందని..మీ అమ్మ సోనియా కూడా ఒప్పించేలా మాట్లాడారన్నారు. కొద్దిరోజుల క్రితం గ్రామీణ మహిళలు రాహుల్ గాంధీ, సోనియాగాంధీతో కలిసి తమ ఇంట్లో భోజనం చేయగా, మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఓ గ్రామీణ మహిళ సోనియా చెవిలో మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేయండి అని చెప్పింది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. అతనికి ప్రస్తుతం 53 సంవత్సరాలు. కానీ అతను ఇంకా వివాహం చేసుకోలేదు. రాహుల్ గాంధీ ఎప్పుడు, ఎవరిని పెళ్లి చేసుకుంటారు అనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో బాలీవుడ్ హాట్ నటి రాహుల్ గాంధీని పెళ్లి చేసుకోవాలనే తన కోరికను వ్యక్తం చేసింది.