ఇటివల కాలంలో సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు అనేక మంది పలు రకాలుగా ప్రయత్నం చేస్తున్నారు. కొంత మంది ట్రాఫిక్ రోడ్లపై డాన్స్ చేసి ఆకట్టుకోగా..మరికొంత మంది ఇంకొన్ని విధాలుగా ట్రై చేస్తున్నారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నమే ఓ వ్యక్తి చేశాడు. కానీ ఇది మాత్రం నెక్ట్స్ లెవల్ అని చూసిన వారు చెబుతున్నారు. అదెంటో మీరే చూడండి.
Cycling with a fridge on your head new york viral video
న్యూయార్క్, ఢిల్లీ, పారిస్, ముంబయి సహా మరికొన్ని అనేక నగరాల్లో రకరకాల ప్రజలు ఉంటారు. బహిరంగ ప్రదేశాల్లో డాన్స్ చేయడం, పాటలు పాడటం, యాదృచ్ఛికంగా గందరగోళాన్ని సృష్టించడం ఇలా పలురకాలుగా ప్రయత్నించి ఎలాగైనా ఫేమస్ కావాలని పలు రకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఇటివల కాలంలో అనేక మంది సరికొత్తగా ఏదైనా చేసి గుర్తింపు దక్కించుకోవాలని చూస్తున్నారు. అచ్చం అలాంటిదే తాజాగా అగ్రరాజ్యం న్యూయార్క్(new york) నగరంలో చోటుచోసుకుంది.
ఇక్కడ ఒక వ్యక్తి సరికొత్తగా వీధి మధ్యలో తన తలపై ఫ్రిజ్ పెట్టుకుని బ్యాలెన్స్ చేస్తూ కనిపించాడు. అది కూడా మాములుగా కాదు. తన తలపై బరువైన రిఫ్రిజిరేటర్ని బ్యాలెన్స్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లో సైకిల్ తొక్కాడు. అది చూసిన అక్కడి స్థానికులు అతని ఫోటోలు, వీడియోలు తీసేందుకు తెగ ఎగబడ్డారు. దీనికి సంబంధించిన వీడియో ఆన్లైన్లో షేర్ చేయగా.. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్(viral video)గా మారింది. ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ‘బార్స్టూల్ స్పోర్ట్స్’లో ఈ వీడియో పోస్ట్ చేయబడింది.
ఈ వీడియో చూసిన కొందరు వీడియో నకిలీదా లేదా నిజమా అని అడుగుతున్నారు. చాలామంది అతని టాలెంట్ ను ప్రశంసించారు. ఇంకో వ్యక్తి అయితే మీరు దీన్ని ఎలా ప్రారంభించారు? మీ తలపైకి ఎలా తెచ్చుకున్నారని ప్రశ్నించారు. ఇది 3వ ప్రపంచ దేశాలలో దశాబ్దాలుగా జరుగుతోందని మరొక వ్యక్తి చెప్పాడు. ఇంకోవ్యక్తి చూసి ఎవరైనా ఈ వ్యక్తికి బైక్ను విరాళంగా ఇవ్వాలని అతని అభిప్రాయం తెలియజేశాడు. అతను ఆఫ్రికాలోని ఘనాకు చెందినవాడని తాను ఖచ్చితంగా అనుకుంటున్నట్లు మరో వ్యక్తి కామెంట్ చేశాడు. అయితే ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్(comment) రూపంలో తెలియజేయండి మరి.