»Rahul Gandhi Granted Bail From Surat Sessions Court
Rahul Gandhi: రాహుల్ గాంధీకి బెయిల్ పొడిగింపు..శిక్షపై ఏప్రిల్ 13న విచారణ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) బెయిల్(bail) ను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో ఏప్రిల్ 13 వరకు బెయిల్ ను పెంచినట్లు తెలిపింది. తదుపరి విచారణ ఏప్రిల్ 13న జరపనున్నట్లు కోర్టు వెల్లడించింది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)కి సూరత్ సెషన్స్ కోర్టు(surath sessiions court) సోమవారం బెయిల్(bail)ను పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ క్రమంలో రాహుల్ గాంధీ బెయిల్‌ను ఏప్రిల్ 13 వరకు పెంచామని తెలిపింది. ప్రధాని మోదీ ఇంటిపేరు గురించి 2019లో రాహుల్ చేసిన వ్యాఖ్యపై పరువు నష్టం కేసులో తనను దోషిగా నిర్ధారిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుపై రాహుల్ అప్పీల్ చేసుకున్న నేపథ్యంలో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.ఈ నేపథ్యంలో తదుపరి విచారణను ఏప్రిల్ 13న, 2023న జరుపనున్నట్లు వెల్లడించింది.
అప్పీల్‌తో పాటు రాహుల్ రెండు దరఖాస్తులు చేసుకున్నట్లు తెలుస్తోంది. వాటిలో మొదటిది సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ కోసం దరఖాస్తు చేయగా రెండవది నేరారోపణ నేపథ్యంలో పార్లమెంట్ నుంచి సస్పెన్షన్ కోసం అప్లై చేసుకున్నారు. అయితే రెండో దరఖాస్తును అనుమతించినట్లయితే దీనికి సంబంధించి లోక్‌సభ సెక్రటేరియట్ నోటిఫికేషన్ జారీ చేసిన అతని లోక్‌సభ సభ్యత్వం తిరిగి పునరుద్ధరించబడుతుంది.
మార్చి 23న చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆ తర్వాత రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై లోక్‌సభ ఎంపీగా అనర్హత వేటు పడింది. అయినప్పటికీ అతని శిక్ష తాత్కాలికంగా నిలిపివేశారు. దీంతోపాటు అతని నేరారోపణకు వ్యతిరేకంగా 30 రోజులలోపు అప్పీల్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తూ కోర్టు గతంలో బెయిల్ మంజూరు చేసింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, సోదరి ప్రియాంక గాంధీ వాద్రా(priyanka gandhi)తో కలిసి వాణిజ్య విమానంలో సూరత్ చేరుకున్నారు. అయితే అతని నేరారోపణపై ఈరోజు సూరత్ కోర్టు స్టే విధించనందున, శిక్షపై స్టే కోసం ఆయన చేసిన దరఖాస్తు ఏప్రిల్ 13న విచారణకు రానుంది.