»Tenth Question Paper Leaked In Telangana Vikarabad On Whatsapp Groups
10th Paper Leak: తెలంగాణలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్..వాట్సాప్ లో చక్కర్లు!
తెలంగాణ(telangana)లో టెన్త్ ఎగ్జామ్స్ ఈరోజు ప్రారంభమైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్(10th question paper leaked) అయిందన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పలువురి వాట్సాప్ ఖాతాల్లో(WhatsApp groups) క్వశ్ఛన్ పేపర్ ప్రత్యక్షం కావడంతో అధికారులతోపాటు విద్యార్థులు కూడా ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణలో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన క్రమంలో మళ్లీ లీకేజ్ కలకలం రేగింది. వికారాబాద్(vikarabad)లోని తాండూరులో సోమవారం పరీక్ష ప్రారంభమైన కొద్ది నిమిషాలకే ఎస్ఎస్సీ(SSC) తెలుగు ప్రశ్నపత్రంలోని పలు విభాగాల చిత్రాలు వాట్సాప్లో వైరల్గా మారినట్లు తెలిసింది. సమాచారం తెలుసుకున్న అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఈ ప్రశ్నపత్రం కూడా లీక్ అయి ఉండవచ్చునని అధికారులు అనుమానిస్తున్నారు.
ఈ క్రమంలో వివిధ విద్యార్థి సంఘాల నేతలు ఈ అంశంపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ప్రశ్నాపత్రం లీక్ అయ్యిందన్న ఆరోపణలను జిల్లా అధికారులు(officers) ఖండించారు. ఈ క్రమంలో దీనిపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ సంఘటన నేపథ్యంలో విద్యార్థులు సహా విద్యాశాఖ అధికారులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఇటీవల TSPSC పేపర్ లీకేజీ కేసులో సిట్(SIT) అధికారులు 16 మందిని అరెస్టు చేశారు. ఈ క్రమంలో అందరినీ విచారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలో చైర్మన్, సెక్రటరీ సహా బోర్డు సభ్యులకు కూడా సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. మరోవైపు బోర్డు సభ్యుడు లింగారెడ్డికి కూడా సిట్ నోటీసులు ఇచ్చి విచారణకు హాజరు కావాలని స్పష్టం చేసింది. ఈ విషయంలో ఛైర్మన్ జనార్దన్ రెడ్డిని కూడా విచారించనున్నారు. బోర్డు సభ్యుడు లింగారెడ్డికి రమేష్ వ్యక్తిగత సహాయకుడు. బోర్డు సభ్యులు సుమిత్రా ఆనంద్ తనోబా, కారం రవీందర్ రెడ్డి, ఆర్ సత్యనారాయణ, రమావత్ ధన్ సింగ్, కోట్ల అరుణ కుమారిని కూడా సిట్ విచారించనుంది.