»Nsui Demands Resignation Of Minister Sabitha Indra Reddy
10th paper leak మంత్రి సబితా రాజీనామా చేయాలని ఎన్ఎస్యూఐ డిమాండ్
వికారాబాద్ జిల్లా తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ లీకయ్యింది. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యూఐ ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
NSUI demands resignation of Minister Sabitha Indra Reddy
10th paper leak:తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పదో తరగతి (10th) బోర్డు పరీక్షలు (board exams) ప్రారంభమైన సంగతి తెలిసిందే. వికారాబాద్ (vikarabad) జిల్లా తాండూర్ (tandur) ప్రభుత్వ పాఠశాలలో తెలుగు కొశ్చన్ పేపర్ (telugu question paper) లీకయ్యింది. దీంతో తీవ్ర కలకలం రేగింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంస్థ ఎన్ఎస్యూఐ (nsui) ఏకంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha indrareddy) రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
హైదరాబాద్ అబిడ్స్‌లో (abids) గల ఎస్ఎస్సీ బోర్డు ముందు ఎన్ఎస్యూఐ కార్యకర్తలు ధర్నా చేపట్టారు. కొశ్చన్ పేపర్ (question paper) లీకేజీకి సంబంధించి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఘటనకు నైతిక బాధ్యత ఎవరూ వహిస్తారు అని అడిగారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (sabitha) రాజీనామా చేయాలని కోరారు.
టీచర్ బందెప్ప ఫోన్ నుంచి తెలుగు పేపర్ (telugu paper leak) లీకయ్యిందని గుర్తించారు. క్వశ్చన్ పేపర్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే తెలుగు పేపర్ బయటికి వచ్చింది. దీంతో విద్యార్థుల పేరంట్స్ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పేపర్ లీక్‌పై (paper leak) ఎంఈవో వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ బందెప్పను (bandeppa) అదుపులోకి తీసుకున్నారు.
స్కూల్ టీచర్ బందెప్ప పేపర్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని వికారాబాద్ ఏఎస్పీ మురళి వెల్లడించారు. ఉదయం 9.37 గంటలకు వాట్సాప్ గ్రూపులో పెట్టాడని వివరించారు. ఆ సమయంలో విద్యార్థుల పరీక్ష హాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపులో ఉన్నవారు ఆ మెసేజ్‌ను ఉదయం 11 గంటలకు చూశారని ఏఎస్పీ వెల్లడించారు. ఎగ్జామ్ హాల్ నుంచి క్వశ్చన్ పేపర్ బయటికి షేర్ చేసినందుకు ఇన్విజిలేటర్ పై కేసు నమోదు చేస్తామని చెప్పారు.
పేపర్ లీకేజీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు విద్యాశాఖ ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు వేసింది. తాండూర్‌లో స్కూల్ నెం.1 సెంటర్ చీఫ్ సూపరింటిండెంట్, డిపార్ట్ మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్ బందెప్పను సస్పెండ్ చేశారు. బందెప్ప గతంలో కూడా ఇలా చేశాడట.. అతనిపై పోక్సో కింద కేసు నమోదైందట. 2017లో టెన్త్ క్లాస్ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తించినట్టు ఆరోపణలు వచ్చాయి.
పరీక్ష సమయం పూర్తవకముందే పదో తరగతి ప్రశ్నపత్రం బయటకు రావడంపై నివేదిక ఇవ్వాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డిని విద్యాశాఖ ఆదేశించింది. ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్‌పై చర్యలు తీసుకున్న విద్యాశాఖ.. వారిని పరీక్షల విధుల నుంచి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.