వికారాబాద్ జిల్లా తాండూరులో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన ఏడు నిమిషాలకై ప్రశ్నపత్రం లీక్ అయినట్లు అక్కడి కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) ప్రకటించారు. ప్రశ్నపత్రం లీక్ చేయడంలో ఉపాధ్యాయుడు బందెప్ప పాత్ర ఉన్నట్లు పోలీసులు చెప్పినట్లు వెల్లడించారు.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూర్లో ఈరోజు 10వ తరగతి పరీక్షలు(10th question paper leaked) మొదలైన కొద్ది సేపటికే ప్రశ్నపత్రం లీక్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ఘటనపై వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి(narayana reddy) క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న బయోసైన్స్ ఉపాధ్యాయుడు ఈ ఉదంతానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారని వెల్లడించారు. అయితే తాండూర్లోని ఒకటవ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం ఉదంయ 9.30 గంటలకు 10వ తరగతి తెలుగు పరీక్ష మొదలైంది. ఆ క్రమంలో బయోసైన్స్ టీచర్ బందెప్ప క్వశ్ఛన్ పేపర్ ను 9.37 నిమిషాలకు ఫొటో తీసి పలువురికి వాట్సాప్ ద్వారా పంపినట్లు గుర్తించారు.
అయితే అతను తర్వాత వెంటనే ఆ మేసేజ్ డిలీట్ చేసినప్పటికీ ఆ పేపర్ ను చూసిన మరికొంత మంది డౌన్ లౌడ్ చేసుకుని ఇంకొంత మందికి ఫార్వర్డ్ చేశారు. ఆ క్రమంలో పలు గ్రూపుల ద్వారా ఆ ప్రశ్నపత్రం అనేక మందికి చేరింది. అయితే ఈ విషయం ఉదయం 11 గంటలకు ఎంఈవోకు తెలియడంతో అతను పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమదైన శైలిలో విచారించి ఉపాధ్యాయుడు బందెప్ప కారణంగానే ప్రశ్నపత్రం నెట్టింట చక్కర్లు కోట్టినట్లు నిర్ధారించారు.
మరోవైపు ఎగ్జామ్ పూర్తికాక ముందే ప్రశ్నపత్రం బయటకు రావడం పట్ల నివేదిక ఇవ్వాలని తెలంగాణ విద్యాశాఖ.. వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డిని కోరింది. ఈ నేపథ్యంలో ఆ పరీక్ష కేంద్రంలో ఉన్న ఇన్విజిలేటర్, సూపరింటెండెంట్, డిపార్ట్ మెంటర్ ఆఫీసర్లను విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు అసలు ప్రశ్నపత్రం ముందే లీక్ అయ్యిందా లేదా అనే దానిపై విద్యార్థులు సహా పలువురు విద్యార్థి సంఘ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఇటీవల TSPSC ప్రశ్నపత్రాల లీక్ కేసులో 16 మంది అరెస్టు అయిన ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా ఇప్పుడు మళ్లీ ప్రశ్నపత్రం లీక్ ఘటన పట్ల పలువురు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.