»Five Naxalites Killed With Encounter Two Main Leaders Among The Dead At Chatra Jharkhand
Encounter: ఐదుగురు నక్సలైట్స్ హతం..మృతుల్లో ఇద్దరు కీలక నేతలు
జార్ఖండ్(jharkhand) పోలీసులతో ఛత్రా(chatra)లో జరిగిన ఎన్కౌంటర్(Encounter)లో ఐదుగురు నక్సల్స్ హతమయ్యారని పోలీసులు సోమవారం తెలిపారు. హత్యకు గురైన ఐదుగురిలో ఇద్దరి తలలపై రూ.25 లక్షలు, మరో ఇద్దరికి రూ.5 లక్షల చొప్పున రివార్డులు ఉన్నాయని ప్రకటించారు.
జార్ఖండ్(jharkhand)లోని చత్రా(chatra) జిల్లాలో భారీ ఎన్కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు నక్సల్స్ మరణించారు. అయితే ఐదుగురిలో ఇద్దరిపై రూ. 25 లక్షల రివార్డు ఉండగా, మరో ఇద్దరిపై 5 లక్షల రివార్డులు ఉన్నట్లు జార్ఖండ్ పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో రెండు ఏకే 47 రైఫిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు.
నక్సల్స్ ఉనికి గురించి కచ్చితమైన సమాచారం మేరకు జాయింట్ టీమ్ కూంబింగ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఆ క్రమంలో కోయెలిబెడ పోలీస్ స్టేషన్ పరిధిలోని అడవిలో ముగ్గురు తిరుగుబాటుదారులను అరెస్టు చేయడంలో విజయం సాధించామని అంతఘర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ (ASP) ఖోమన్ సిన్హా తెలిపారు. అరెస్టయిన నక్సల్స్ నిర్మాణ పనుల్లో నిమగ్నమైన వాహనాలను తగలబెట్టడం, టవర్లకు నిప్పంటించడం, పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి వ్యక్తులపై దాడి చేయడం వంటి అనేక ఘటనల్లో నిందితులుగా ఉన్నారని ASP సిన్హా తెలిపారు.
ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. మరోవైపు ఆదివారం తెల్లవారుజామున ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో తిరుగుబాటు బారిన పడిన ముగ్గురు నక్సల్స్‌ను పోలీసులు, DRG సంయుక్త బృందం అరెస్టు చేసింది. అరెస్టయిన మావోయిస్టులలో సముంద్ అలియాస్ సుమన్‌సింగ్ అంచాల (42), సంజయ్ కుమార్ ఉసెండి (27), పరశ్రమ్ దంగూల్ (55)గా గుర్తించారు.