Leakage festival:పదో తరగతి తెలుగు పరీక్ష (telugu paper) పేపర్ లీకేజీ (leak) తెలంగాణ రాష్ట్రంలో పెను దుమారం రేపింది. ఇప్పటికే టీఎస్ పీఎస్సీ (tspsc) 4 పేపర్లు లీక్ కాగా.. సిట్ (sit) విచారణ జరుగుతోంది. ఇప్పుడు పదో తరగతి పరీక్ష పేపర్ లీక్ అవడంతో పేరంట్స్ ఆందోళన చెందుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay) హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో లీకేజీల పండగ జరుగుతోందని మండిపడ్డారు.
టెన్త్ పేపర్ లీక్ కావడం దురదృష్టకరం అని బండి సంజయ్ (bandi sanjay) అన్నారు. కేసీఆర్ పాలనలో (kcr rule) లీకేజీ కామన్ అయిపోయిందన్నారు. పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేని ప్రభుత్వం రాష్ట్రంలో ఉందన్నారు. ప్రభుత్వం, యంత్రాంగం ఏం చేస్తోందని ఆయన అడిగారు. లీకేజీ దోషులను కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉందన్నారు.
పేపర్ లీకేజీ నేపథ్యంలో మిగతా పరీక్షల నిర్వహణపై ఆందోళన నెలకొంది. పరీక్షలు నిర్వహిస్తారా..? లేదంటే వాయిదా వేస్తారా అనే సందేహాలు వస్తున్నాయి. దీంతో విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. రేపటి పరీక్ష రెగ్యులర్‌గా జరుగుతుందని విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన (devasena) స్పష్టంచేశారు. పరీక్షల వాయిదా లేదని.. పేరంట్స్ (parents), స్టూడెంట్స్ (stuents) ఆందోళన చెందొద్దని సూచించారు. ఇప్పటికే నలుగురు ఉద్యోగులను సస్పెండ్ చేశామని వివరించారు.
తాండూర్ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ బందెప్ప ఫోన్ నుంచి తెలుగు పేపర్ (telugu paper leak) లీకయ్యిందని గుర్తించారు. క్వశ్చన్ పేపర్ స్థానిక వాట్సాప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావడంతో వెలుగులోకి వచ్చింది. పరీక్ష ప్రారంభమైన కాసేపటికే తెలుగు పేపర్ బయటికి వచ్చింది. దీంతో విద్యార్థుల పేరంట్స్ తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. పేపర్ లీక్‌పై (paper leak) ఎంఈవో వెంకయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీచర్ బందెప్పను (bandeppa) అదుపులోకి తీసుకున్నారు.
స్కూల్ టీచర్ బందెప్ప పేపర్‌ను వాట్సాప్ ద్వారా షేర్ చేశాడని వికారాబాద్ ఏఎస్పీ మురళి వెల్లడించారు. ఉదయం 9.37 గంటలకు వాట్సాప్ గ్రూపులో పెట్టాడని వివరించారు. ఆ సమయంలో విద్యార్థుల పరీక్ష హాల్లో ఉన్నారని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపులో ఉన్నవారు ఆ మెసేజ్‌ను ఉదయం 11 గంటలకు చూశారని ఏఎస్పీ వెల్లడించారు. ఎగ్జామ్ హాల్ నుంచి క్వశ్చన్ పేపర్ బయటికి షేర్ చేసినందుకు ఇన్విజిలేటర్ పై కేసు నమోదు చేస్తామని చెప్పారు.