»A 12 Year Old Boy Brazil Chacalzinho Neto Has A Six Pack Body
Viral Video: 12 ఏళ్ల బుడ్డేడికి.. సిక్స్ ప్యాక్ బాడీ
మీరెప్పుడైనా 12 ఏళ్లకే కండలు తిరిగిన బాడీ కల్గిన వ్యక్తిని చుశారా? లేదా అయితే ఈ వీడియోలో చూసేయండి. ఈ బాలుడు చిన్నప్పటి నుంచే ఎక్సర్ సైజ్ చేయడం ప్రారంభించాడంటా. ఇక తర్వాత అదే క్రమంలో అలవాటుగా మారి రోజు చేయడం ప్రారంభించడని తెలుస్తోంది. దీంతో ఆ పిల్లాడి బాడీకి సిక్స్ ప్యాక్స్ వచ్చాయి.
ఓ బుడ్డోడు 12 ఏళ్లకు జిమ్ లో తెగ కసరత్తులు చేస్తున్నాడు. అంతేకాదు అతను చేస్తున్న ఎక్సర్ సైజ్ మూలంగా శరీరంలో సిక్స్ ప్యాక్స్ కూడా వచ్చాయి. అతన్ని చూసిన పెద్దవారు సహా అనేక మంది ఇదేంటని ఆశ్చర్యపోతున్నారు. ఈ బాలుడి వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి మరి. ఇక అతని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెజిల్‌కు చెందిన 12 ఏళ్ల బాలుడు కౌజిన్హో నెటో కండలు తిరిగిన ఆకట్టుకునే శరీరాకృతిని కల్గి ఉన్నాడు. అయితే అతను కఠినమైన శిక్షణా నియమావళికి పాటిస్తాడని తెలుస్తోంది. అయితే కౌజిన్హో అసలు పేరు కార్లోస్ అగస్టో పిటాంగా నెటో కాగా.. ఈ పిల్లాడి తండ్రి ఫిట్నెస్ ఔత్సాహికుడు కావడంతో అతనితోపాటు రోజు జిమ్ కు వెళ్లవాడంటా.
ఆ క్రమంలో కౌజిన్హో ప్రతిరోజూ ఉదయం 5:30 గంటలకు 5 కి.మీ పరుగు, కొన్ని డజన్ల సిటప్స్ చేసే వాడని తెలుస్తోంది. అంతేకాదు అల్పాహారం తర్వాత, అతను పాఠశాలకు కూడా వెళ్తాడని చెబుతున్నారు. తన హోంవర్క్ ముగించిన తర్వాత అతను జిమ్‌లో రెండున్నర గంటలు ఉంటాడని అతని ఫాదర్ అంటున్నారు.
ఈ క్రమంలో అతని తల్లిదండ్రులు అతని అథ్లెటిక్ కెరీర్‌పై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అతని కోసం పూర్తి స్థాయి జట్టు కంసో పెట్టుబడి కూడా పెట్టారు. అందులో కోచ్, డాక్టర్, ఫిజియోథెరపిస్ట్ కూడా ఉన్నారు. దీంతోపాటు పోషకాహార నిపుణుడు కూడా ఉన్నారు. ఆ క్రమంలో అతనికి సోషల్ మీడియాలో వందల వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు.
ఈ వీడియో చూసిన పలువురు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అలా పిల్లలు పరిమితికి మించి బరువులు ఎత్తడం వల్ల పిల్లల ఎముకలు వంగే ప్రమాదం ఉందని అంటున్నారు. దీంతోపాటు అతని కీళ్లపై బరువు ఏర్పడి నష్టం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. మరోక వ్యక్తి అతను తన బాల్యాన్ని కోల్పోతున్నాడని వ్యాఖ్యానించారు. మరోవైపు కౌజిన్హో తల్లిదండ్రులు మాత్రం అతని అభివృద్ధిని పర్యవేక్షిస్తున్నామని, అతను సాధారణంగా పెరుగుతున్నాడని అంటున్నారు.