VZM: ఎల్.కోట మండలంలో పండగ పూట విషాదం చోటుచేసుకుంది. మల్లివీడుకు చెందిన వీరనాగా పాత్రుడు చెరువులో పడి మృతిచెందినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. సాయత్రం బహిర్భూమికి వెళ్లిన పాత్రుడు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతిచెందినట్లు స్థానికులు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.