NZB: రుద్రూర్లో శనివారం కుక్కల దాడిలో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. గ్రామాల్లో వీధికుక్కల స్వైర విహారంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. రాత్రివేళల్లో గుంపులుగా వచ్చి రోడ్లపై నుంచి వెళ్లే వారిపై దాడులు చేస్తుండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నుంచి రక్షించాలన్నారు.