AP: మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించిన హెడ్ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణం బొమ్మూరు పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈనెల 8న హెడ్‌కానిస్టేబుల్ ప్రసాద్.. అదే స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళా హోంగార్డుతో అసభ్య ప్రవర్తించాడు. ఈ ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేయడంతో నిందితుడిపై పోలీసులు కేసు నమోదు చేశారు.