ATP: అమరావతిలోని తన నివాసంలో నంద్యాలకు చెందిన నరసింహులుకు రూ. 1.05 లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కును ఎమ్మెల్యే పరిటాల సునీత పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితుడికి ఈ సహాయం ఎంతో ఊరటనిస్తుందని ఆమె పేర్కొన్నారు. ఆపదలో ఉన్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.