TG: మహబూబ్నగర్ జిల్లాలో దారుణ ఘటన వెలుగుచూసింది. మూడేళ్ల కూతురుకు రేబీస్ సోకిందని భ్రమపడి.. ఓ తల్లి కూతురిని చంపి, తాను ఆత్మహత్య చేసుకుంది. తన భార్య యశోద మతిస్థిమితం కోల్పోయిందని, కుక్కలు ఎంగిలి చేసిన పల్లీలు తినడంతో పాపకు రేబీస్ వచ్చిందని ఆమె అనుమానించిందని భర్త తెలిపాడు. టీకాలు వేయించినా అనుమానం పోకపోవడంతో ఈ దారుణానికి పాల్పడిందని ఆయన ఆవేదనకు గురయ్యారు.