SRD: పుల్కల్ మండలం మిన్పూర్ గ్రామానికి చెందిన అక్షిత జోగిపేట బస్టాండ్లో సంగారెడ్డి వెళ్లే బస్సు ఎక్కిన తర్వాత, తల్లి ఆధార్ కార్డు తన వద్ద ఉందని గుర్తుకు వచ్చి కదులుతున్న బస్సులోంచి దూకేసింది. గాయాలపాలైన ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చెవి, ముక్కులోంచి రక్తం రావడంతో సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాగానే ఉన్నట్లు ఆమె సోదరుడు తెలిపారు.