»300 Passengers Trapped In Landslides In Uttarakhand
Uttarakhand:లో విరిగిపడ్డ కొండచరియలు..చిక్కుకున్న 300 మంది ప్రయాణికులు
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పితోర్‌ఘర్ జిల్లాలో కొండచరియలు విరిగిపడటంతో ప్రధాన రహదారి కొట్టుకుపోయింది. ఈ క్రమంలో దాదాపు 300 మంది ప్రయాణికులు చిక్కుకుపోయారని అధికారులు చెబుతున్నారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లోని పితోర్‌ఘర్ ప్రాంతంలో ఘోరమైన కొండచరియలు విరిగిపడటంతో భక్తులతో సహా 300 మందికి పైగా ప్రజలు గల్లంతయ్యారు. లఖన్‌పూర్‌లోని లిపులేఖ్-తవాఘాట్ రహదారిపై కొండచరియలు విరిగిపడటంతో 100 మీటర్ల రహదారి కొట్టుకుపోయింది. ధార్చుల, గుంజికి వెళ్లే మార్గం పూర్తిగా ధ్వంసమైంది. భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటం వల్ల ఈ ప్రాంతంలో వరదలు కూడా సంభవించాయి. దీంతో అనేక నదులు వాటి ఒడ్డున ప్రవహిస్తున్నాయి. యమునోత్రి, గంగోత్రి ధామ్‌కు వెళ్లే యాత్రికులు సహా వందలాది మంది ప్రజలు కొండచరియల ప్రాంతాల్లో చిక్కుకున్నారు. ఈ క్రమంలో యాత్రికులను తాత్కాలిక ఆశ్రయాల్లో ఉంచి వారికి ఆహారం, నీరు అందిస్తున్నారు.
పితోర్‌గఢ్ శివార్లలో ధార్చుల పైన 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లిపులేఖ్-తవాఘాట్ మోటార్ రహదారి, లఖన్‌పూర్ సమీపంలో కొండచరియలు విరిగిపడి 100 మీటర్లు కొట్టుకుపోయాయి. ఆ క్రమంలో దాదాపు 300 మంది ధార్చుల, గుంజిలో చిక్కుకుపోయారని తెలుస్తోంది. మరోవైపు కొండచరియలను తొలగించి, రహదారిని తిరిగి ప్రారంభించడానికి రెస్క్యూ బృందాలు పనిచేస్తున్నాయి. అయితే దీనికి చాలా రోజులు పట్టే అవకాశం ఉంది.
మరోవైపు ఉత్తరాఖండ్‌లోని అల్మోరా, బాగేశ్వర్, చమోలి, చంపావత్, డెహ్రాడూన్, గర్వాల్, హర్ద్వార్, నైనిటాల్, పితోర్‌ఘర్, రుద్రప్రయాగ్, తెహ్రీ గర్వాల్, ఉధమ్ సింగ్ నగర్ ఉత్తరకాశీ జిల్లాలతో సహా పలు జిల్లాలకు తుఫాను హెచ్చరికలను కూడా అక్కడి అధికారులు జారీ చేశారు. ఈ పరిస్థితుల్లో యమునోత్రి, గంగోత్రి ధామ్ యాత్రకు వెళ్లే భక్తులకు వాతావరణ సూచనలను అధికారులు జారీ చేశారు. ఆయా ప్రాంతాలకు వెళ్లే భక్తులు రెయిన్ కవర్లు, గొడుగులు, వెచ్చని దుస్తులతో సిద్ధంగా ఉండాలని సూచించారు. ఇంకోవైపు యాత్రికులు సురక్షిత ప్రదేశాలలో ఉండాలని, అనవసరంగా ప్రయాణించవద్దని కోరుతున్నారు.
300 People Stranded In Uttarakhand After Massive Landslide Cuts Off Road