»Mouse Deer Found In Chhattisgarh Rare Animal Video Goes Viral
Mouse Deer: ఛత్తీస్‌గఢ్‌లో కనిపించిన మూషిక జింక..అరుదైన జీవి వీడియో వైరల్
మూషిక జింక(Mouse Deer)లు సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్టులలో ఎక్కువగా కనిపించనున్నట్లు డైరెక్టర్ ధమ్షిల్ గన్వీర్ తెలిపారు. ఇవి ఇతర జింకలను చూస్తే సిగ్గుతో పారిపోతాయని, వీటి జాతి గురించి సమగ్ర అధ్యయనం జరగలేదని ఆయన అన్నారు.
జింక(Deers)లంటే అందరికీ ఇష్టమే. పిల్లల దగ్గరి నుంచి పెద్దవారి వరకూ జింకలను చూస్తే ఎంతో ఆనందపడతారు. వాటితో ఆడుకోవాలని చూస్తుంటారు. అటువంటి జింకలు మూడు నుంచి నాలుగు అడుగుల ఎత్తులో ఉండటం మనం చూసుంటాం. అయితే ఇక్కడొక జింక మాత్రం ప్రత్యేకంగా కనిపించింది. దీనిని జింక అని అనకుండా అరుదైన మూషిక జింక(Mouse Deer) అని అంటే సరిపోతుంది. ఈ అరుదైన మూషిక జింక ఛత్తీస్‌గఢ్‌లోని కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కు(Kanger Valley National Park)లో కనిపించింది.
ఛత్తీస్‌గఢ్‌లో కనిపించిన మూషిక జింక:
#WATCH छत्तीसगढ़: कांगेर घाटी राष्ट्रीय उद्यान में हिरण की दुर्लभ प्रजाती 'माउस डियर' पाई गई है। भारत में पाए जाने वाले हिरणों की 12 प्रजातियों में से माउस डियर विश्व में सबसे छोटे हिरण समूह में से एक है। pic.twitter.com/HgK8SxgHPj
మూషిక జింక(Mouse Deer) పర్యాటకులను, జంతు ప్రేమికులను విశేషంగా ఆకట్టుకుంది. కంగేర్ వ్యాలీ నేషనల్ పార్కులో ఉన్న ట్రాప్ కెమెరాలో ఈ మూషిక జింక విజువల్స్ రికార్డ్ అయ్యాయి. దేశంలో ఇప్పటి వరకూ మొత్తం 12 రకాల జింకల జాతులు ఉన్నాయి. వాటన్నింటిలో మూషిక జింకే చాలా చిన్నదని వ్యాలీ నేషనల్ పార్క్ డైరెక్టర్ ధమ్షిల్ గన్వీర్ తెలిపారు. మూసిక జింకను స్పాటెడ్ చెవ్రోటెయిన్(Spotted Chevrotein) అని కూడా అంటారని ఆయన పేర్కొన్నారు.
ఇటువంటి అరుదైన మూషిక జింక(Mouse Deer)లు సౌత్ ఆసియా, సౌత్ ఈస్ట్ ఆసియాలోని రెయిన్ ఫారెస్టులలో ఎక్కువగా కనిపించనున్నట్లు డైరెక్టర్ ధమ్షిల్ గన్వీర్ తెలిపారు. ఇవి ఇతర జింకలను చూస్తే సిగ్గుతో పారిపోతాయని, వీటి జాతి గురించి సమగ్ర అధ్యయనం జరగలేదని ఆయన అన్నారు. అడవుల్లో జరిగిన కార్చిచ్చుల్లో, జంతువుల వేట వంటి కారణాల వల్ల ఈ మూషిక జింకల జాతి అంతరించిపోతోందని, వీటిని కాపాడుకోవడానికి సంరక్షణ చర్యలు చేపట్టాలని పార్క్ డైరెక్టర్ తెలిపారు.