GNTR: పొన్నూరులో రేషన్ బియ్యం అక్రమ రవాణాపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇవాళ తెల్లవారుజామున అర్బన్ CI వీరా నాయక్, SI శ్రీహరి నేతృత్వంలో షరాఫ్ బజార్లోని HDFC బ్యాంక్ సమీపంలో దాడి చేసి, 1,550 కేజీల పీడీఎస్ బియ్యంతో ఉన్న అశోక్ లేలాండ్ ట్రాలీని సీజ్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు జరిపిన ఈ ఆపరేషన్లో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.