Dehli liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్లో (Dehli liquor scam) కవిత (kavitha) ఈడీ విచారణ ముగిసింది. ఈ రోజు 10 గంటలపాటు సుధీర్ఘంగా ప్రశ్నించారు. చిరునవ్వుతో విక్టరీ సింబల్ చూపుతూ బయటకు వచ్చారు. కారులో తుగ్లక్ రోడ్డులో గల సీఎం కేసీఆర్ (cm kcr) నివాసానికి బయల్దేరారు.
కవిత (kavitha) ఈ రోజు ఉదయం 11.30 గంటలకు ఈడీ ఆఫీసుకు వచ్చారు. రాత్రి 9.40 గంటలకు ఆమె బయటకు వచ్చారు. ఈ రోజు మొబైల్స్ (mobiles) ధ్వంసం గురించి అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. అధికారులు గుచ్చి గుచ్చి ప్రశ్నించగా.. కవిత సమాధానం చెప్పినట్టు సమాచారం.
నిన్నటి కన్నా ఉత్సాహాంగానే కవిత (kavitha) కనిపించారు. గేట్ నంబర్ 3 (gate number 3) నుంచి తన లాయర్లతో కవిత బయటకు వచ్చారు. బయటకు వస్తూనే అభివాదం చేశారు. కారు ఎక్కి మరీ.. విజయ సంకేతం చూపారు. చిరు నవ్వుతోనే ఆమె కనిపించారు.