SRCL: వేములవాడ నాంపల్లి కమాన్ వద్ద ఓ మహిళ మెడలోని పుస్తెలతాడుతో పాటు నగదును గుర్తుతెలియని వ్యక్తులు అపహరించారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం అన్నారం గ్రామానికి చెందిన దేవుపల్లి భూధవ్వ ఆమె భర్త చంద్రయ్య వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చారు. ఈ క్రమంలో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 2.5 తులాల పుస్తెలతాడు, నగదును ఎత్తుకెళ్లారు. ఘటనపై కేసు నమోదైంది.