RR: షాద్‌నగర్ నియోజకవర్గం కొత్తూరు వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైపాస్‌లోని పెంజర్ల కూడలిలో బైకును బస్సు ఢీకొనడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.