పార్లమెంట్ హౌస్ వెలుపల, లోపల భద్రతా ఉల్లంఘనలకు పాల్పడిన నలుగురు నిందితులను 7 రోజుల రిమాండ్‌కు పంపారు. అయితే ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ మాత్రం 15 రోజుల రిమాండ్ కోరింది.
తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారినప్పుడు గతంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులను మార్చడం మామూలే.
పెరుగుతున్న ద్రవ్యోల్బణం కారణంగా ప్రజలకు మరో దెబ్బ తగిలింది, CNG ధర 1 రూపాయి పెరిగింది. నేటి నుంచి ఢిల్లీలో సీఎన్జీ ధరలు పెరిగి కిలో రూ.76.59కి చేరాయి.
మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. ఓ వివాహ వేడుకలో కలుషిత ఆహారం తిని 80మంది అతిథులు ఆస్పత్రి పాలయ్యారు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం 9 మంది ఎంపీలు సహా మొత్తం 14 మంది కాంగ్రెస్ సభ్యులపై చర్యలు తీసుకున్నారు. ఈ ఎంపీలందరినీ లోక్‌సభ నుంచి సస్పెండ్ చేశారు.
ప్రభుత్వం ఎలా నడపాలో మాకు తెలుసునని కేటీఆర్ పై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త ఏర్పాడిన ప్రభుత్వాన్ని దీవించడం పోయి.. ప్రభుత్వం ఎలా నడుస్తుందో చూస్తామని కేటీఆర్ పేర్కొనడం సరికాదన్నారు.
రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆదివారం 87వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం మెక్సికన్ టీవీ ఛానెల్ ఎన్ ప్లస్‌తో పోప్ తన అంత్యక్రియల గురించి మాట్లాడారు. తనని వాటికన్ బయటే ఖననం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా బీజేపీ నేత మోహన్ యాదవ్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తన ప్రభుత్వం మొదటి ఉత్తర్వును జారీ చేశారు.
సచివాలయంలో ధరణి పోర్టల్ పై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమీక్షించారు. ఈ కీలక సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి, రాజనర్సింహ హాజరయ్యారు.