తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారినప్పుడు గతంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులను మార్చడం మామూలే.
IAS Transfers : తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టారు. ప్రభుత్వం మారినప్పుడు గతంలో కీలక పదవుల్లో ఉన్న అధికారులను మార్చడం మామూలే. తాజాగా ఐదుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. హైదరాబాద్ సీపీగా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి నియమితులయ్యారు. తాజాగా పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేశారు. అధికారుల బదిలీపై ఇప్పటికే సీఎస్ శాంతికుమారితో సీఎం రేవంత్ చర్చించినట్లు తెలుస్తోంది. హెచ్ఎండీఏ కమిషనర్‌గా ఆమ్రపాలి, వ్యవసాయ డైరెక్టర్‌గా బి. గోపి, ట్రాన్స్ కో జెన్ కో చైర్మన్ అండ్ ఎండీగా రిజ్వీ.. డిప్యూటీ సీఎం ఓఎస్డీగా ఐఏఎస్ కృష్ణభాస్కర్. SPDCL సీఎండీగా ముషారఫ్ అలీ. ఝా.. టీఎస్ఎన్పీడీసీఎల్ సీఎండీగా వరుణ్‌రెడ్డి నియమితులయ్యారు.
ఇక.. హెచ్ ఎండీఏ కమీషనర్ గా నియామకమైన ఆమ్రపాలికి డైనమిక్ ఆఫీసర్‌గా పేరుంది. ఇటీవల కేంద్ర సర్వీసులో ఆమె డిప్యూటేషన్ పూర్తి కావడంతో రాష్ట్ర సర్వీసులో చేరనున్నారు. ఏపీ కేడర్‌కు చెందిన ఆమ్రపాలి రాష్ట్ర విభజన తర్వాత వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. 2018లో తెలంగాణ ఎన్నికల సంయుక్త ప్రధానాధికారిగా కూడా ఆమ్రపాలి పనిచేశారు. అంతకుముందు జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్‌గానూ పనిచేశారు. 2020లో ఆమ్రపాలికి ప్రధానమంత్రి కార్యాలయం నుంచి పిలుపు రావడంతో పీఎంవోలో డిప్యూటీ కార్యదర్శిగా చేరారు. అక్కడ రెండేళ్ల పాటు పని చేసి డిప్యూటేషన్ పూర్తి కావడంతో మళ్లీ తెలంగాణ ప్రభుత్వంలోకి రానున్నారు.