»Pope Francis Wants To Be Buried In Rome Basilica Health Updates
Pope Francis : పోప్ ఫ్రాన్సిస్‌ను ఇక్కడే ఖననం చేసేది ఎక్కడో తెలుసా ?
రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆదివారం 87వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం మెక్సికన్ టీవీ ఛానెల్ ఎన్ ప్లస్‌తో పోప్ తన అంత్యక్రియల గురించి మాట్లాడారు. తనని వాటికన్ బయటే ఖననం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.
Pope Francis : రోమన్ క్యాథలిక్ క్రైస్తవుల మత నాయకుడు పోప్ ఫ్రాన్సిస్ ఈ ఆదివారం 87వ ఏట అడుగుపెట్టారు. మంగళవారం మెక్సికన్ టీవీ ఛానెల్ ఎన్ ప్లస్‌తో పోప్ తన అంత్యక్రియల గురించి మాట్లాడారు. తనని వాటికన్ బయటే ఖననం చేయాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఇది జరిగితే, పోప్ ఫ్రాన్సిస్ ఒక శతాబ్దంలో వాటికన్ వెలుపల ఖననం చేయబడిన మొదటి పోప్ అవుతారు. తాను రోమ్‌లోని సెయింట్ మేరీస్ బసిలికాలో ఖననం చేయాలనుకుంటున్నట్లు ఫ్రాన్సిస్ చెప్పాడు. పోప్ ఫ్రాన్సిస్ సెయింట్ మేరీస్ బసిలికాలో ఖననం చేయడం వెనుక కారణాన్ని కూడా చెప్పారు. దేవుని తల్లిగా పిలుచుకునే మేరీ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. అందుకే ఇక్కడే సమాధి చేయాలనుకుంటున్నారు. పోప్ ఫ్రాన్సిస్ ప్రార్థనల కోసం తరచుగా సెయింట్ మేరీస్ బసిలికాను సందర్శిస్తుంటారు.
మరొక దేశాన్ని సందర్శించే ముందు, తరువాత పోప్ ఫ్రాన్సిస్ ఎల్లప్పుడూ ప్రార్థనల కోసం సెయింట్ మేరీస్ బసిలికాకు వెళతారు. ఇప్పటికే అనుకున్న ప్రకారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు పీటర్స్ స్క్వేర్‌లో జరగనున్నాయి. వాటికన్ వెలుపల ఖననం చేయబడిన చివరి పోప్ లియో XIII. లియో XIII 1903 సంవత్సరంలో మరణించాడు. అతను రోమ్‌లోని సెయింట్ జాన్ లాటరన్ బాసిలికాలో ఖననం చేయబడ్డాడు. ఇటీవల ముగిసిన COP 28కి పోప్ ఫ్రాన్సిస్ కూడా హాజరు కాబోతున్నారు. అయితే చివరి క్షణంలో ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు దుబాయ్‌లో వాతావరణ మార్పు, దాని ప్రభావాలపై సమావేశం జరిగింది. ఫ్రాన్సిస్ బ్రాంకైటిస్‌తో బాధపడుతున్నాడు. ఆయన ఆరోగ్యం చాలా మెరుగుపడిందని చెప్పారు. పోప్ ఫ్రాన్సిస్ వచ్చే ఏడాది బెల్జియంలో పర్యటించనున్నారు.