మెదక్ జిల్లా నర్సాపూర్ లో బీఆర్ఎస్ కృతజ్ఞత సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి హరీశ్‌రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ వాళ్లు గ్లోబల్ ప్రచారం చేసి అధికారం
తెలంగాణ శాసనసభ స్పీకర్ పదవికి నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవికి నామినేషన్ దాఖలు చేశారు.
మహదేవ్ గేమింగ్ యాప్ యజమాని రవి ఉప్పల్‌ను దుబాయ్‌లో అదుపులోకి తీసుకున్నారు. రవి ఉప్పల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. రవి ఉప్పల్‌పై రెడ్ కార్నర్ నోటీసు జారీ చేశారు.
కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ ప్రసాద్ సాహుపై వారం రోజులుగా ఆదాయపు పన్ను శాఖ దాడులు చేస్తోంది. ఎంపీ ఇంట్లో ఇప్పటివరకు రూ.350 కోట్లకు పైగా నగదు లభ్యమైంది. ఇప్పుడు ఎంపీ ఇంటి నుంచి బంగారం, ఖరీదైన ఆభరణాల కోసం ఆదాయపు పన్ను శాఖ ఆరా తీస్తోంది.
తెలంగాణ జెన్ కో అక్టోబర్ నెలలో అసిస్టెంట్ ఇంజనీర్, కెమిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టుల భర్తీకి డిసెంబర్ 17న రాత పరీక్ష నిర్వహించాలని నిర్ణయించారు.
TSPSC సభ్యుడు ఆర్ సత్యనారాయణ రాజీనామా చేశారు. తానేమీ తప్పు చేయలేదని స్పష్టం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో తమ బాధ్యతను నిర్వర్తించే వాతావరణం లేదని పేర్కొన్నారు.
CBSE హైస్కూల్, ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 15 నుంచి పరీక్ష జరగనుంది. 10వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుండి మార్చి 13 వరకు నిర్వహించబడతాయి.