తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు.
కేరళలోని ఎర్నాకులంలోని కన్వెన్షన్ సెంటర్లో క్రైస్తవుల ప్రార్థనా సమావేశంలో భారీ బాంబు పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో ఒకరు మృతి చెందగా, 40 మంది గాయపడినట్లు సమాచారం.
యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక
ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA) ప్రభుత్వ , కొన్న ప్రైవేట్ బ్యాంక్ ఉద్యోగులకు 15 శాతం జీతం పెంపును ప్రతిపాదించింది. త్వరలో వారంలో ఐదు రోజులు మాత్రమే పని చేసే విధానాన్ని కూడా తీసుకొచ్చే వీలున్నట్లు తెలుస్తోంది.
ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై దాడి చేసిన ఉగ్రవాద సంస్థ హమాస్ నాయకుడు శుక్రవారం కేరళలోని మలప్పురంలో సాలిడారిటీ యూత్ మూవ్మెంట్ నిర్వహించిన ర్యాలీకి హాజరైనట్లు సమాచారం.
దీపావళికి ముందే ప్రధాని మోడీ శుభవార్త ప్రకటించారు. శనివారం( 2023 అక్టోబరు 28) జరిగే ఉపాధి మేళాలో ప్రభుత్వ శాఖల్లో నియమితులైన 51,000 మంది యువతకు నియామక పత్రాలను ఆయన పంపిణీ చేయనున్నారు.
దివ్య ఖోస్లా కుమార్ భారతీయ చిత్ర పరిశ్రమలో నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తన ప్రతిభను చాటుకుంది. ఆమె వివిధ వాణిజ్య ప్రకటనల ద్వారా తన దర్శకత్వ నైపుణ్యాలను ప్రదర్శించడమే కాకుండా, అనేక మ్యూజిక్ వీడియోలలో కూడా గుర్తించదగిన పాత్రలు పోషించింది.