ప్రకాశం: నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి మరణించిన గురిజేపల్లి గ్రామ మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ వెన్న వెంకటేశ్వర రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఆయనతో పాటు మండల ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు కూడా కుటుంబాన్ని పరామర్శించి, శోకసముద్రంలో ఉన్న కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వర రెడ్డి మరణం తీరని లోటు అన్నారు.