ఛత్తీస్‌గఢ్‌లో వింత వ్యాధి కలకలం రేగింది. సుక్మా జిల్లా దనికొడ్తలో అంతుచిక్కని వ్యాధి సోకి ఒకే నెలలో 13 మంది మరణించారు. దీంతో గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షల నిమిత్తం 80 మంది రక్త నమూనాలను వైద్య సిబ్బంది సేకరించారు. అడవుల్లో మహువా పువ్వుల సేకరణకు వెళ్లిన వారు డీహైడ్రేషన్‌కు గురవ్వటంతో మరణాలు సంభవించినట్లు వైద్యులు చెబుతున్నారు.