CTR: పుంగనూరు టౌన్ మున్సిపల్ హైస్కూల్లో గురువారం సరస్వతి దేవి విగ్ర ప్రతిష్ఠాపన జరిగింది. మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం పదో తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు ‘ఆల్ ది బెస్ట్ చెప్పి’ హాల్ టికెట్లను పంపిణీ చేశారు. అందరూ మంచి ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.