కృష్ణా: మచిలీపట్నంలోని 3 స్తంభాల సెంటర్లోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి వద్ద గురువారం అగ్నిప్రమాదం జరిగింది. ఒక ఇంటి నుంచి పెద్ద శబ్దం వచ్చి మంటలు వ్యాపించాయని స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేలిన శబ్దం రావడంతో బయటకు పరుగులు తీసినట్లు పేర్కొన్నారు. మచిలీపట్నం ఫైర్ ఇంజన్ అందుబాటులో లేకపోవడంతో బంటుమిల్లి ఫైర్ ఇంజన్ వచ్చి మంటలను అదుపు చేసినట్లు చెప్పారు.