PLD: మహిళా దినోత్సవం సందర్భంగా పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన ఆట పోటీల్లో అన్ని ప్రభుత్వ శాఖల్లో పని చేస్తున్న మహిళా ఉద్యోగులు ఉత్సాహంగా పాల్గొన్నారని కలెక్టర్ అరుణ్ బాబు అన్నారు. నరసరావుపేటలో గురువారం ఆయన మాట్లాడుతూ.. మహిళా ఉద్యోగులు తమ రోజువారి విధుల్లోని ఒత్తిడిని అధిగమించేందుకు క్రీడలు దోహదపడతాయని అన్నారు.