ASR: రాజవొమ్మంగి పోలీస్టేషన్లో గురువారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక జెడ్పీ విద్యార్థులకు పోలీస్టేషన్లో పోలీస్ విధులు, రికార్డులు, ఆయుధాలు, వైర్ లెస్ సెట్లు పనితీరును గూర్చి అదనపు ఎస్సై చిన్నాలు రెడ్డి అవగాహన కల్పించారు. మహిళా దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. ప్రతీ ఒక్కరు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు.