యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది అలేఖ్య హారిక
Dethadi Harika : సోషల్ మీడియా ఫాలో అయ్యే వారికి అలేఖ్య హారిక గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. తెలంగాణ స్లాంగ్(telangana slang)తో వీడియోలు చేసి యూట్యూబ్(youtube)లో పాపులర్ అయ్యింది. యూట్యూబ్‌లో వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సిరీస్‌లతో భారీ పాపులారిటీ సంపాదించుకుంది. ఈ తెలంగాణ బ్యూటీ బిగ్ బాస్ లో పాల్గొని మరింత ఫేమస్ అయ్యింది. ప్రస్తుతం ఆమె యూట్యూబ్‌లో చాలా ప్రైవేట్ ఆల్బమ్‌లు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. అప్పుడప్పుడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తోంది.
అలేఖ్య హారిక ఇప్పుడు హీరోయిన్ గా అరంగేట్రం చేయబోతున్నట్లు సమాచారం. అలేఖ్య హారిక హీరోయిన్ గా, సంతోష్ శోభన్ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కానుంది. బేబీ నిర్మాత ఎస్కేఎన్, బేబీ దర్శకుడు సాయి రాజేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఎంట్రీ ఇవ్వనున్నాడని సమాచారం. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని, త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుందని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.