Congress: ఎన్నికల ముందు కాంగ్రెస్‌కు బిగ్ షాక్.. పార్టీకి గుడ్ బై చెప్పిన కీలకనేత
తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు.
Congress: తొలి జాబితా విడుదల సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ నేత పొన్నాల లక్ష్మయ్య తనను అవమానించారని ఆ పార్టీని వీడారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇప్పుడు రెండో జాబితా తర్వాత నాగం జనార్దన్ రెడ్డి కూడా అదే బాట పట్టబోతున్నారు. ఈరోజు నాగంతో కేటీఆర్ భేటీ కానున్నారని, ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్లో చేరికపై తుది నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించిన మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి నిరాశే ఎదురైంది. ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేష్‌రెడ్డి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. నేతపై నాగం ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న వారిని మోసం చేస్తున్నారని, అవసరం తీరాక పార్టీలో కొత్తగా చేరిన పారాచూట్ నేతలకే టిక్కెట్లు ఇస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాశనమవుతోందని నాగం అన్నారు. కనీసం తనకు టికెట్ ఎందుకు ఇవ్వలేదో కారణం చెప్పలేదన్నారు. బీఆర్ఎస్లో ఎమ్మెల్సీగా కొనసాగుతున్న దామోదర్‌రెడ్డి కుమారుడికి కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడమేంటని నాగం ప్రశ్నించారు. గతంలో పొన్నాల విషయంలో మంత్రి కేటీఆర్ భేటీ కీలకంగా మారింది. పొన్నాలతో కేటీఆర్ భేటీ అనంతరం బీఆర్ఎస్లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు. ఇప్పుడు నాగంను కూడా కేటీఆర్ కలుస్తారని అంటున్నారు. సాయంత్రం జరిగే ఈ భేటీ తర్వాత నాగం బీఆర్ఎస్ చేరికపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.