మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన(Upasana Konidela) మంగళవారం రోజు జూన్ 20న బిడ్డకు జన్మనివ్వనున్నట్లు అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షులు రవణం స్వామినాయుడు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
ఆదిపురుష్ మూవీ డైలాగ్ రైటర్ మనోజ్ ముంబై పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ఆదిపురుష్ డైలాగ్స్ మరో వారం రోజుల్లో మార్చి ప్రదర్శితమవుతున్న సినిమాలో చేరుస్తున్నట్లు తెలిపారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ మూవీ నుంచి లిరికల్ వీడియో సాంగ్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. విడుదలైన ఈ సాంగ్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్ల మధ్య వాదనలు జరుగుతున్నాయి. నటులు సినిమాల కోసం అడ్వాన్స్ లు తీసుకుని డేట్స్ ఇవ్వడం లేదని నిర్మాతలు రచ్చకెక్కారు. దీనిపై విచారణ జరగనుంది. ఇందులో నటులకు రెడ్ కార్డ్ ఇచ్చే అవకాశం ఉంది.
కాజల్ అగర్వాల్ ఫీమేల్ లీడ్ రోల్ లో సత్యభామ అనే మూవీ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఆమె కనిపించనున్నారు.