ఏపీ మంత్రి అంబటి రాంబాబు జనసేన అధినేత పవన్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. పవన్ ఒక పిరికిపంద అని వ్యాఖ్యలు చేశారు. పవన్ కు ప్రాణ హాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు.
జనసేన పార్టీ(Janasena Party) అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan) ఒక పిరికిపంద అని వైసీపీ మంత్రి అంబటి రాంబాబు(AP Minister Ambati Rambabu) అన్నారు. వారాహి యాత్ర(Varahi Yatra)లో వైసీపీ(Ycp) ప్రభుత్వంపై పవర్ తీవ్రంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజల్లో సానుభూతి పొందేందుకే తనకు ప్రాణహాని ఉందంటూ పిరికిపంద మాటలు మాట్లాడుతున్నాడని అంబటి విమర్శించారు. వారాహి అంటే అమ్మవారు అని, ఆ పేరు పెట్టుకుని ఆ వాహనంపై ఎక్కి దుర్మార్గంగా ఎలా మాట్లాడుతావని పవన్ ను ప్రశ్నించారు.
ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయాడని, మళ్లీ కచ్చితంగా పవన్ ఓడిపోతాడని అంబటి రాంబాబు(AP Minister Ambati Rambabu) స్పష్టం చేశారు. అంతేకాకుండా పవన్(Pawan Kalyan) తీసే ఏ సినిమా కూడా ఇక హిట్ కాదని శపించారు. పవన్ కాకినాడ వెళ్లి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడని, అధికారంలోకి వచ్చాక బట్టలూడదీసి కొడతాడని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒక ఎమ్మెల్యేను బట్టలూడదీసి కొట్టే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని ప్రశ్నించారు.
పవన్(Pawan Kalyan) ఇలాగే మాట్లాడితే చెప్పులే కాదు, బట్టలు కూడా పోగొట్టుకుంటాడని, బనియన్, కట్ డ్రాయర్ తో వచ్చి తన బట్టలు కూడా పోయాయని చెబుతాడని విమర్శించారు. పవన్ రాజకీయాల్లోకి వచ్చి ప్యాకేజీ స్టార్ అయ్యాడని, ఇవాళ బూతుల స్టార్ అవుతున్నాడని అంబటి చురకలంటించాడు. పవన్ కు నిజంగానే ప్రాణహాని ఉంటే దానికి తగిన ఆధారాలు చూపాలన్నారు. ప్రాణహాని లేకపోయినా తప్పుడు ఆరోపణలు చేస్తే చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను కోరుతానని అంబటి(AP Minister Ambati Rambabu) స్పష్టం చేశారు.