యూట్యూబ్ కు పోటీగా ట్విట్టర్ సరికొత్త ప్రయోగం చేయనుంది. త్వరలోనే ట్విట్టర్ వీడియో యాప్ అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ యజమాని ఎలాన్ మస్క్ వెల్లడించారు.
హీరో నాగశౌర్య నటిస్తున్న తాజా చిత్రం రంగబలి. ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. పూర్తి సాంగ్ ను రేపు సాయంత్రం విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
బాలీవుడ్ అందాల భామ అలియా భట్ హాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ ఆమె కథానాయికగా కాకుండా విలన్ గా నటిస్తోంది. తాజాగా ఆమె నటిస్తున్న 'హార్ట్ ఆఫ్ స్టోన్' నుంచి మేకర్స్ తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు.
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా 13వ సినిమా ప్రారంభమైంది. VD13 వర్కింగ్ టైటిల్‌తో ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు ఈ మూవీని నిర్మిస్తున్నారు. 'గీత గోవిందం' వంటి సూపర్ హిట్ తీసిన పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ దేవరకొండ సర
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో 30 సీట్లను సీఎం కేసీఆరే నిర్ణయిస్తారని అన్నారు. మోదీ హైదరాబాద్ కు వస్తే కేసీఆర్ కు వణుకు పుడుతుందన్నారు.
ఇండోనోషియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత పురుషుల జోడీ అయిన సాత్విక్-చిరాగ్ విజయం సాధించి చరిత్ర సృష్టించారు. మెన్స్ డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిల జోడీ బంగారు పతకాన్ని సాధించింది.
ఇండియాలో భారీ ఎండలు నమోదవుతున్నాయి. తీవ్ర ఎండలకు గత మూడు రోజుల్లో 98 మంది వడదెబ్బ తగిలి మృతి చెందారు. ఈ నేపథ్యంలో పలు ప్రాంతాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.