తెలంగాణ(Telangana) రైతులకు కేసీఆర్(CM KCR) సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. జూన్ 26వ తేది నుంచి రైతు బంధు(Rythu Bandhu) నిధులను విడుదల చేయనున్నట్లు సర్కార్ నిర్ణయించింది. వానాకాలం పంట పెట్టుబడి కింద రైతుల ఖాతాల్లో నిధులను జమ చేయనున్నట్లు కేసీఆర్ సర్కార్ తెలిపింది. ఈ సందర్భంగా త్వరలో పోడు భూములకు పట్టాలు పంపిణీ చేయాలని సీఎం కేసీఆర్(CM KCR) అధికారులను ఆదేశించారు. పట్టాల పంపిణీ అనంతరం పోడు రైతులకు కూడా రైతుబంధు సాయం అందించాలని అధికారులను ఆదేశిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. సర్కార్ ప్రకటనతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరో వైపు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో నీటి పారుదల శాఖపై సీఎం కేసీఆర్(CM KCR) ఉన్నతస్థాయి సమావేశం చేపట్టారు. ఈ సమావేశానికి మంత్రులు, ఇరిగేషన్ శాఖ అధికారులు, సిబ్బంది హాజరయ్యారు. రుతుపవనాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో రాష్ట్ర రైతాంగానికి వానాకాలం పంట సాగునీటి సరఫరాపై కేసీఆర్ చర్చలు జరిపారు. జలాశయాల్లో నీటి నిల్వతో పాటు సంబంధిత విషయాలపై మంత్రులు, అధికారులతో కేసీఆర్ పలు విషయాలను చర్చించారు.