ప్రస్తుతం థియేటర్లో డైనోసర్ దండయాత్ర ఓ రేంజ్లో ఉంది. ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. అయినా కూడా కళ్యాణ్ రామ్ డెవిల్‌గా దూసుకొస్తున్నాడు. దీంతో సలార్ కాకుండా.. డెవిల్తో ఫైనల్ టచ్ కానుంది.
అనుకున్నట్టే సలార్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయ్యాడు ప్రభాస్. కెజియఫ్ తర్వాత ప్రశాంత్ నీల్ చేసిన సినిమా కావడంతో.. భారీ అంచనాలతో థియేటర్లోకి వచ్చింది సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లను అందుకుంటోంది సలార్.
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటీవల తెలంగాణలో ఇద్దరు వ్యక్తులు కూడా మరణించారు. వాళ్లకి వైద్య పరీక్షలు నిర్వహించగా.. పాజిటివ్ అని తేలింది.
సమాజ్‌వాదీ పార్టీ నేత స్వామి ప్రసాద్ మౌర్య మరోసారి హిందుత్వంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఇటీవల జరిగిన బహుజన్ సమాజ్ హక్కుల సదస్సును ఉద్దేశించి మౌర్య వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో పాకిస్థాన్‌లో జరగబోయే సాధారణ ఎన్నికల్లో తొలిసారిగా హిందూ మహిళ పోటీ చేయనున్నారు. పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ తరఫున అభ్యర్థిగా పీకే-25 స్థానానికి సవీరా ప్రకాశ్ ఈ నెల 23న నామినేషన్ దాఖలు చేశారు.
యానిమల్ సినిమాపై ఎన్ని విమర్శలు వచ్చిన భారీ విజయాన్ని అందుకుంది. ఈచిత్రంపై చాలామంది విమర్శలు చేశారు. అయితే ఇటీవల ఈ విమర్శలపై యానిమల్ డైరక్టర్ సందీప్ వంగా స్పందించారు.
తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ విజయం సాధించాలని చూస్తుంది. ఈక్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.