తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చుకునే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈక్రమంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు దరఖాస్తుల స్వీకరిస్తామని తెలిపింది.
తెలంగాణ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్ రెడ్డి తొలిసారి ప్రధాని మోదీని కలిసి నిధుల గురించి వివరించడం సంతోషమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరా ఆధారంగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ దేశాన్ని గుర్తించేలా ఏది ఒంటిపై ప్రదర్శించొద్దని జాతీ
అమెరికాలోని టెక్సాస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తెలుగువాళ్లు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురం వాసులు. ప్రమాద వార్త తెలియడంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
సౌత్ ఆఫ్రికాపై ఇప్పటి వరకు ఒక్క సారి కూడా టెస్ట్ సిరీస్ గెలవలేదని, భారత్‌కు ఇదే చక్కని అవకాశం అని టీమిండియా చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పేర్కొన్నారు. దానికోసం ప్రతీ అవకాశాన్ని వినియోగించుకుంటామని వెల్లడించారు.
బీజేపీకి వ్యతిరేకంగా దేశ ప్రజలను ఏకం చేసేందుకు కొద్ది నెలల క్రితం కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఈసారి దేశంలోని తూర్పు నుంచి పశ్చిమ ప్రాంతం వరకు భారత్ న్యాయ యాత్ర చేపట్టనున్నారు.
రోగులకు అందించిన చికిత్సలకు తగ్గట్లు ఫీజుల చెల్లింపుల్లో ఆలస్యం, ప్యాకేజీ ధరలను పెంచకపోవడాన్ని నిరసిస్తూ ఈ నెల 29వ తేదీ నుంచి ఆరోగ్యశ్రీ ట్రస్టు కింద కొత్త కేసులను చూసేది లేదని అసోసియేషన్ ఏపీ ప్రభుత్వానికి తెలిపింది.
కసాయి సెంట్రల్ ప్రావిన్స్‌లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కూడా మృతి చెందారు.