తెలంగాణలో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ విజయం సాధించాలని చూస్తుంది. ఈక్రమంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం.
YS Sharmila: తెలంగాణలో విజయం సాధించి ఉత్సాహంతో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ విజయం సాధించాలని చూస్తుంది. అయితే ఏపీలో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు వైఎస్ షర్మిలకు అప్పగించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈక్రమంలో ఈ నెల 27న అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ ఏఐసీసీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో భేటీ కానున్నారు. దీనికి తప్పకుండా హాజరు కావాలని ఏపీ పీసీసీ చీఫ్ రుద్రరాజు, కొత్త ఇన్చార్జి మాణిక్ రావు సహా పార్టీలో ఉండే ముఖ్య నేతలకు ఢిల్లీ నుంచి పిలుపు వచ్చింది.
జగన్ అరాచక పాలనపై అసంతృప్తిగా ఉన్నవాళ్లు.. షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన వెంటనే కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల స్వీకరిస్తే వైసీపీ ఓటర్లు కాంగ్రెస్ వైపు మళ్లుతారని భావిస్తున్నారు. అయితే ఈ విషయంపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. నూతన సంవత్సరం రోజున దీనిపై అధికారిక ప్రకటన వస్తున్నట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఇప్పటికే షర్మిల చర్చలు జరిపారు. వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేయడానికి కూడా సిద్ధమయ్యారు. అయితే కాంగ్రెస్ నాయకులు ఏపీలో వైఎస్ఆర్కు ఉన్న క్రేజ్‌ను వాడుకుని మళ్లీ పార్టీని బలోపేతం చేయాలని.. ఈక్రమంలోనే షర్మిలను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలిగా నియమించనున్నట్లు సమాచారం.