»Heart Attack A 13 Year Old Boy Has A Heart Attack
Heart Attack: 13 ఏండ్ల బాలుడికి గుండెపోటు
ప్రస్తుతం చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.
Heart Attack: ఆరోగ్యంగా ఉన్నవాళ్లు కూడా ఈరోజుల్లో గుండెపోటుతో అకస్మాత్తుగా మరణిస్తున్నారు. చిన్నపిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు డ్యాన్స్ చేస్తూ, జిమ్ చేస్తూ గుండెపోటుతో మరణిస్తున్నారు. తాజాగా రాజన్న సిరిసిల్లలో ఓ 13 ఏండ్ల బాలుడు గుండెపోటుతో చనిపోయాడు. నిరుపేద కుటుంబానికి చెందిన శంకర్ దంపతులకు ఇద్దరు జశ్వంత్, సుశాంత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కూలి పనిచేస్తూ.. కొడుకులను చదివిస్తున్నారు.
జశ్వంత్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా.. సుశాంత్ ముస్తాబాద్ మండలంలో గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. క్రిస్మస్ పండుగ కోసం సుశాంత్ హాస్టల్ నుంచి ఇంటికి వచ్చాడు. ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతుండగానే ఛాతీలో నొప్పి వచ్చింది. దీంతో వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లి.. ప్రాథమిక చికిత్స చేశారు. కానీ చికిత్స చేస్తుండగానే సుశాంత్ మృతి చెందాడని వైద్యులు తెలిపారు. క్రిస్మస్ వేడుకలతో ఇంట్లో సందడికి బదులుగా ఒక్కసారిగా విషాదం నెలకొంది.