ప్రస్తుతం థియేటర్లో డైనోసర్ దండయాత్ర ఓ రేంజ్లో ఉంది. ప్రభాస్ దెబ్బకు బాక్సాఫీస్ బద్దలవుతోంది. అయినా కూడా కళ్యాణ్ రామ్ డెవిల్‌గా దూసుకొస్తున్నాడు. దీంతో సలార్ కాకుండా.. డెవిల్తో ఫైనల్ టచ్ కానుంది.
ప్రస్తుతం ట్రెండ్ చూస్తుంటే.. సంక్రాంతి వరకు సలార్‌దే హవా ఉండే ఛాన్స్ ఉంది. అలాగే.. ఈ ఇయర్లో లాస్ట్ పంచ్ సలార్‌దే అనుకున్నారు. కానీ 2023కి ఫైనల్ టచ్ ఇవ్వడానికి డెవిల్‌గా రాబోతున్నాడు నందమూరి కళ్యాణ్ రామ్. గత ఏడాది బింబిసార వంటి సోషియో ఫాంటసీ చిత్రంతో బ్లాక్ బస్టర్ సాధించిన కళ్యాణ్ రామ్.. ఈ ఏడాదిలో వచ్చిన అమిగోస్ చిత్రంతో మెప్పించలేకపోయాడు. అందుకే.. డిసెంబర్ 29న 2023 సంవత్సరానికి ఫైనల్ పంచ్ ఇవ్వడానికి వస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఇప్పటికే డెవిల్ సినిమా నుంచి విడుదలైన పాటలు, టీజర్, ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాతో మళ్లీ ఫామ్‌లోకి రావాలని చూస్తున్నాడు కళ్యాణ్ రామ్.
బ్రిటిష్ కాలంలో గూఢచారి ఎలా ఉండేవారు? లాంటి కొత్త విషయాన్ని డెవిల్ మూవీలో చూపించబోతున్నాడు. ఇప్పటికే డెవిల్ సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. 2 గంటల 26 నిమిషాల రన్ టైంతో డెవిల్ థియేటర్లోకి రాబోతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ స్పీడప్ చేసి సినిమా పై అంచనాలను పెంచుతున్నారు మేకర్స్. ఈ సినిమాని తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. అభిషేక్ పిక్చర్స్ బ్యానర్‌పై అభిషేక్ నామా దర్శక నిర్మాతగా రూపొందుతోన్న ఈ సినిమాకు శ్రీకాంత్ విస్సా మాటలు, స్క్రీన్ ప్లే, కథను అందించారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు. మరి డైవిల్ ఫైనల్ పంచ్ ఎలా ఉంటుందో చూడాలి.