»New Year Celebrations Do You Know Which Country Ntr Went To
NTR: న్యూ ఇయర్ సెలబ్రేషన్స్.. ఎన్టీఆర్ ఏ దేశం వెళ్లాడో తెలుసా?
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం చాలమంది స్టార్ హీరోలు ఫారిన్‌కు వెళ్తుంటారు. వారిలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. మరి ఫ్యామిలీతో కలిసి తారక్ ఎక్కడికి వెళ్లాడు? ఏ దేశం వెళ్లాడు? ఎప్పుడు తిరిగి రానున్నాడు?
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అప్పుడప్పుడు వెకేషన్స్‌కి వెళ్తుంటాడు. అది కూడా ఫ్యామిలీతో కలిసి ఫారిన్లో ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటాడు. గతంలో ట్రిపుల్ ఆర్ రిలీజ్ సమయంలో పలు దేశాలు చుట్టొచ్చాడు ఎన్టీఆర్. ఆస్కార్ కోసం అమెరికాలో దాదాపు నెల రోజుల పాటు ఉన్నాడు. ఇక ట్రిపుల్ సినిమా తర్వాత.. కొరటాల స్క్రిప్టు రెడీ చేసే వరకు కాస్త రిలాక్స్ అయిన ఎన్టీఆర్.. ఇప్పుడు దేవర షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి పెద్దగా గ్యాప్ ఇవ్వలేదు తారక్. ముఖ్యంగా వెకేషన్‌కు వెళ్లలేదు. అయితే ఇప్పుడు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కోసం ఎన్టీఆర్ ఫారిన్ ఫ్లైట్ ఎక్కేశాడు. దేవర షూటింగ్‌కు చిన్న బ్రేక్ ఇచ్చి.. న్యూ ఇయర్ వెకేషన్‌కు చెక్కేశాడు యంగ్ టైగర్.
ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో ఉన్న ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. భార్య, ఇద్దరు పిల్లలతో వెకేషన్‌కు వెళ్లాడు జూనియర్. ఇండస్ట్రీ వర్గాల ప్రకారం.. ఈసారి వెకేషన్‌కు ఎన్టీఆర్ జపాన్ దేశం వెళ్లినట్టుగా తెలుస్తోంది. అక్కడ వారం పది రోజులు ఉండి.. జనవరి సెకండ్ వీక్‌లో తిరిగి రానున్నట్టుగా సమాచారం. తిరిగి వచ్చాక దేవర సెట్స్‌లో జాయిన్ అవనున్నాడు. అయితే.. ఎన్టీఆర్ వచ్చేలోపు దేవర ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌ను రెడీ చేయనున్నాడు కొరటాల.
తిరిగి రాగానే ఈ గ్లింప్స్‌ను రిలీజ్ చేస్తారని ఇండస్ట్రీ వర్గాల సమచారం. జనతా గ్యారేజ్ కాంబినేషన్‌ను రిపీట్ చేస్తూ.. ఎన్టీఆర్, కొరటాల చేస్తున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా దేవర రాబోతోంది. రెండు భాగాలుగా రానున్న దేవర వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నాడు.